అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు పుష్ప 3 కూడా ఉంటుందంటున్నారు.. ఇంకోవైపు త్రివిక్రమ్ సైతం బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్‌లో అల్లు అర్జున్ దారెటు..? ఒకవేళ అట్లీనే ఫస్ట్ ఆప్షన్ అయితే.. ఆ సినిమా అప్‌డేట్స్ ఏంటి..? ఎవరు నిర్మించబోతున్నారు..? హీరోయిన్లు ఎవరు..?
రాజమౌళి RRR తీసినట్లు.. అల్లు అర్జున్ కూడా AAA ప్లాన్ చేస్తున్నారు. అక్కడ రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కలిస్తే.. ఇక్కడ అల్లు అర్జున్, అనిరుధ్, అట్లీ కలుస్తున్నారు. అందుకే AAA అంటున్నారు.
ఈ సినిమాపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.. ఎప్రిల్ 8న అధికారిక సమాచారం వచ్చేలా కనిపిస్తుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మినహాయిస్తే.. అల్లు అర్జున్, అట్లీ సినిమా దాదాపు ఖరారైపోయింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ ఇప్పుడొచ్చాయి.
AAA ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే ఇమ్మీడియట్ సినిమా అయితే ఇదే. దీని తర్వాతే త్రివిక్రమ్ అయినా.. పుష్ప 3 అయినా అని తెలుస్తుంది.
ఆగస్ట్‌లో ముహూర్తం పెట్టి.. అక్టోబర్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని చూస్తున్నారు అట్లీ, బన్నీ. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో కీలక పాత్ర కోసం త్రిష పేరు బాగా వినిపిస్తుంది. 2025 సెకండాఫ్‌లో AAA విడుదల కానుంది. దీనికోసం అల్లు అర్జున్ 120 కోట్లు.. అట్లీ 60 కోట్లు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.