top of page
Suresh D

విజయ్​ సేతుపతి, కత్రినాల​ 'మేరీ క్రిస్మస్' - సస్పెన్స్ థ్రిల్లర్‌తో 'అంధాధున్' డైరెక్టర్!🎥✨

కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘మేరీ క్రిస్మస్’. బద్లాపూర్, అంధాధున్ ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి స్పెషల్ గా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర బృందం... తాజాగా తెలుగు ట్రైలర్ ను ఆవిష్కరించింది. 🎥✨


bottom of page