top of page
Suresh D

‘మేం దేవుళ్లను తప్పుగా చూపించలేం’.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

నార్త్ ఇండియాలోనే కాకుండా.. అమెరికాలోనూ ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. హనుమాన్ చిత్రయూనిట్.. దర్శకుడిపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గతేడాదిలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్, రామసేతు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ రెండు చిత్రాలు తీవ్రస్తాయిలో విమర్శలు ఎదుర్కోన్నాయి. కానీ తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అలాంటి చిత్రాలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని అన్నారు ప్రశాంత్ వర్మ. “తెలుగు సినీ పరిశ్రమలో రామాయణం, మహాభారతం కథలను తిరిగి చెబుతూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సార్ ఇలాంటి సినిమాలు చాలా చేశారు. కానీ ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదు. ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. నిజానికి ఎన్టీఆర్ అంటే మాకు కృష్ణుడు, రాముడు. చాలా మంది ఇళ్లలో విగ్రహాలకు బదులుగా ఆయన ఫోటోస్ ఉన్నాయి. పరిశ్రమగా దేవుళ్లకు ప్రాతినిధ్యం వహించడంలో మేం ఎప్పుడూ తప్పు చేయలేదు” అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.

“నేను పని చేస్తున్న అన్ని రకాల చిత్రాలను నేను చూస్తాను. వాటిలో కొన్నింటి నుంచి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటాను. అలాగే ఇతర సినిమాల నుంచి ఎలా మూవీ తీయకూడదో నేర్చుకుంటాను. విభిన్న ఫలితాలను సాధించడానికి ప్రతిదీ భిన్నంగా చేయాలి. బహుశా.. ఇది మనం పెరిగిన వాతావరణం.. ఆ కథలను వింటూ పెరిగిన విధానం వల్ల కావచ్చు. ఇలాంటివి మా మనసులకు దగ్గగా ఉంటాయి. నేను ఇతర చిత్ర నిర్మాతల కోసం మాట్లాడలేదు. కానీ సంస్కృతి చరిత్రలను ఎప్పటికీ తారుమారు చేయను. నేను నిజంగా రామాయణం, మహాభారతాలను నా స్టైల్లో తిరిగి చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను ఒక చిత్ర నిర్మాతగా తగినంత పరిణితి చెందలేదని .. అలా చేయడానికి తగినంత అనుభవం లేదని అనుకుంటున్నారు. ఆ పాత్రల స్పూర్తితో కొత్త కల్పిత కథలను రూపొందిస్తున్నాను ” అని అన్నారు.

bottom of page