top of page
Suresh D

డిజాస్టర్.. డంకీ ట్రైలర్‌పై పెదవి విరుస్తున్న ఫ్యాన్స్😬🎬

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న డంకీ మూవీ ట్రైలర్ మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన విషయం తెలుసు కదా. అయితే ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో పూర్తిగా నెగటివ్ రియాక్షన్లు వస్తున్నాయి. ట్రైలర్ రిలీజైన కాసేపటికే డిజాస్టర్ అనే పదం ట్రెండింగ్ లో ఉంది.

డంకీ ట్రైలర్ చాలా బోరింగ్ గా ఉందని, స్టోరీలో అసలు కొత్తదనం ఏదీ కనిపించడం లేదని అభిమానులు పెదవి విరిచారు. సుమారు మూడు నిమిషాలు ఉన్న డంకీ ట్రైలర్ లో చూపించిన కథ ఎన్నో పంజాబీ సినిమాలు ఇప్పటికే చూపించాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక ఇందులో నటీనటులను బలవంతంగా పంజాబీ మాట్లాడించినట్లు ఉందని ఇంకొందరు అన్నారు.

ఇక ట్రైలర్ చివర్లో వయసు మీద పడిన క్యారెక్టర్ లో షారుక్ ను చూపించారు. ఇది మరీ దారుణంగా ఉందని, దీనికోసం భారీస్థాయిలో వీఎఫ్ఎక్స్ వాడినట్లు కనిపిస్తోందని కొందరు అభిమానులు ట్వీట్లు చేశారు. రాజ్ కుమార్ హిరానీ తీసిన సినిమాల్లో ఇదే అత్యంత వీక్ సినిమా కావచ్చని ఓ అభిమాని అభిప్రాయపడ్డాడు. ఇక ట్రైలరే సినిమా స్టోరీ మొత్తం చెప్పేసినట్లుగా ఉందని మరో వ్యక్తి అన్నాడు.

నిజానికి డంకీ ట్రైలర్ పై పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ ట్రైలర్ కు కామెడీతోపాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. గతంలో వచ్చిన రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లాగే ఈ డంకీ కూడా అన్ని ఎమోషన్స్ రంగరించి ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకేలాంటి సినిమాలు అందించిన రాజ్ కుమార్ హిరానీ.. తొలిసారి షారుక్ ఖాన్ తో మూవీ చేశాడు. దీంతో సహజంగానే డంకీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది పఠాన్, జవాన్ లతో రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్.. హ్యాట్రిక్ సాధిస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. డిసెంబర్ 21న డంకీ రిలీజ్ కానుంది.🤷‍♂️🎭


bottom of page