ఈ సమ్మర్ లో అధ్యాత్మిక ప్రాంతాలను వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). అతి తక్కువ ధరలోనే Pancharamam Temples Tour ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా… ఏపీలోని ప్రముఖ ఐదు పంచారామ క్షేత్రాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
పంచారామాల టూర్ షెడ్యూల్ :
పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలను చూసేందుకు పంచారామాల టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
ప్రతి ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
నాన్ ఏసీ హైటెక్ కోచ్ బస్సులో జర్నీ చేస్తారు.
పెద్దలకు రూ.4999, పిల్లలకు రూ. 3999గా టికెట్ ధరలు ఉన్నాయి.
ఇందులో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షరామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శిస్తారు
DAY-1 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు.
DAY-2 - ఉదయం 5 గంటలకు అమరావతికి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి Palakollu, Bhimavaram, Draksharamam, Samarlakotaకు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
DAY-3 - ఉదయం 07.00 AMకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.