బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది సమ్మర్ ఎంత సప్పగా సాగుతుందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సమ్మర్ రన్ మొదలువుతుందని అందరూ సంబరపడ్డారు. కానీ తీరా చూస్తే దేవర కాస్తా దసరాకి జంప్ అయిపోయాడు. పోనీ ప్రభాస్ కల్కితోనైనా పని అవుతుందేమో అనుకుంటే ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఇది కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ స్టార్ ఏమైందో అందరికీ తెలిసిందే. దీంతో మొత్తానికి సమ్మర్ కాస్తా సప్పగా ముగిసిపోతుంది. కానీ దీపావళికి మాత్రం ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ఐదు క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిపై లుక్కేద్దాం.
జరగండి జరగండి
ఈ లిస్ట్‌లో ఉన్న మొదటి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్. తమిళ డైరెక్టర్ శంకర్ దీన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా శంకర్ ఓ తెలుగు హీరోతో స్ట్రైయిట్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ చివరి నాటికి థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ దీపావళికి థియేటర్లో ముందగా చరణ్ సినిమానే కనిపించనుందన్నమాట.
సూర్య కంగువ
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కంగువ. మగధీర తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా నటిస్తుండగా దిశా పటానీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా కూడా దీపావళి బరిలోనే దిగుతున్నట్లు సమాచారం.
తలైవా తగ్గేదేలే
ఇక ఈ దీపావళికి రాబోతున్న మరో పెద్ద చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన తలైవా ఈ దీపావళికి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
బాలీవుడ్ ధమాకా
ఇక దీపావళిని టార్గెట్ చేస్తూ రెండు బాలీవుడ్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి సింగం ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'సింగం ఎగైన్' చిత్రం. మరొకటి 'భూల్ భూలయ్యా 3'. ఈ రెండు ఫ్రాంచైజీలకు ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్లు అంతా కలిసి సింగం ఎగైన్ చిత్రంతో రాబోతున్నారు. ఈ మసాలా ఎంటర్‌టైనర్‌కి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక భూల్ భూలయ్యా 3 సినిమాను దీపావళి సీజన్‌కే విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండవ భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీ ఈ మూడో పార్ట్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఐదు చిత్రాల్లో గేమ్ ఛేంజర్, కంగువ సినిమాలపై భారీ బజ్ ఉంది. మరి వీటిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.🎥✨