top of page
MediaFx

మీరు రీల్స్‌ చేస్తుంటారా.? మీకోసమే అదిరిపోయే ఫీచర్‌ వచ్చేసింది..


ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్‌ అయిన ఫీచర్స్‌లో రీల్స్‌ ఒకటి. వీటి ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ రీల్స్‌లో సరికొత్త ఫీచర్‌ను యాడ్‌ చేశారు. ప్రస్తుతం రీల్స్‌లో కేవలం పరిమిత సంఖయలో మాత్రమే ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో యూజర్లు తమ రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్‌లను యాడ్‌ చేసుకునే అవకాశం లభించింది.

దీంతో రీల్స్‌ అనుభూతి మరింత మెరుగవుతుందని కంపెనీ చెబుతోంది. మల్టీ ట్రాక్‌ రీల్స్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకప రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసుకోవచ్చు. దీంతో మీ కంటెంట్‌ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే ఈ రీల్స్‌లో మీ ఆడియోను టెక్ట్స్‌, స్టిక్కర్‌, క్లిప్స్‌కు అనుగుణంగా సెలక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో అప్పటికే ఉన్న డిఫాల్ట్‌ ఆడియో ట్రాక్స్‌ మాత్రమే కాకుండా మీరే స్వయంగా ఓ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆడియోను నచ్చిన వారు దాన్ని సేవ్‌ చేసుకొని వాడుకునే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అధిపతి ఆడమ్‌ మొస్సేరీ తెలిపారు. అయితే ఇలా ప్రత్యేకంగా సృష్టించిన ఆడియో ట్రాక్‌లను వారి పేరు మీదే లేబుల్‌ చేస్తామని.. వారికి క్రెడిట్‌ ఇస్తామని వెల్లడించారు.

bottom of page