top of page
MediaFx

మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా..

మరుతున్న జీవనశైలినో, మనుషుల అలవాట్ల వల్లనో కానీ.. చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, సకాలంలో చికిత్స చేయడం ముఖ్యం అని అంటున్నారు. లేదంటే దాని దుష్ప్రభావాలు శరీరంపై ఎఫెక్ట్ అయి అనారోగ్య కారణాలకు దారితీస్తుందని చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని, శరీరానికి ప్రమాదమవుతుందని అంటున్నారు.

గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, అదనపు కొవ్వు, చెడు కొలెస్ట్రాల్‌ను సకాలంలో చెక్ పెట్టాలి. లేదంటే గుండెపోటు, ఇతర వ్యాధుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దాడి చేయొచ్చు. అయితే కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా తయారవుతుంది. ఇది కొవ్వు వంటిది. కణ త్వచాలు, జీర్ణవ్యవస్థ, విటమిన్ డి, ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిలో ఇది చాలా ముఖ్యమైనది. ఇది రక్తంలో కరిగిపోతుంది. దీని కోసం లిపోప్రొటీన్ కణాలు అవసరం.

లిపోప్రొటీన్లలో రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే సాంద్రత కలిగిన లిపోప్రొటీన్. కాబట్టి రెండవ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ను మంచి కొలెస్ట్రాల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినప్పుడు, చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం. ఎలాంటి శ్రమ లేకుండా కాళ్లలో నొప్పి ఉంటే అది కొలెస్ట్రాల్ పెరగడం వల్లనే వస్తుంది. అందువల్ల దీన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం కూడా ఛాతీ నొప్పికి కారణం కావచ్చు. కాబట్టి ఏమాత్రం లక్షణాలు బయటపెడినా డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

bottom of page