top of page
Shiva YT

🚇 ఆర్టీసీ ఉచితం ప్రయాణం అమలు వల్ల మెట్రోకు ఇంత ఎఫెక్ట్ ఉందా..?

🚇 ఆర్టీసీ ఉచితం ప్రయాణం అమలు వల్ల మెట్రో కు అంత ఎఫెక్ట్ ఉండదని, మెట్రో రైళ్ల క్రౌడ్ సెపరేట్ అంటున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. 🚆

ప్రస్తుతానికి ఆర్టీసీ రద్దీ మెట్రో రైళ్లపై ఎఫెక్ట్ చెప్పలేమని, మరో కొద్దీ రోజులు తర్వాత మెట్రో డైలీ రైడర్ షిప్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు. 🗓️ సాధరణంగా సిటిలో ఐటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువగా మెట్రో జర్నీకి అలవాటు పడ్డారు. 🌆 దీంతో లాంగ్ జర్నీ చేసే వాళ్లు, ఉప్పల్, ఎల్బీనగర్ నుండి హైటెక్ సిటి, రాయదుర్గం, కూకట్‌పల్లి ఏరియాలకు వెళ్లే వారు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. 🚗 ముఖ్యంగా పొల్యూషన్, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కావడం, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్ పేట్, లక్డి కా పూల్, లాంటి ట్రాఫిక్ ఏరియాలను దాటుకొని రావడానికి మెట్రో నే బెటర్ అంటున్నారు. 🔄 మరికొందరు లేడీస్ అయితే సొంత వాహనాలను పక్కన పెట్టి ఆర్టీసీ సర్వీస్ ను వాడుకుంటున్నారు. 🚺 మెట్రో లో వెళ్లే వారు కూడా ఫ్రీ జర్నీనీ ఉపయోగించుకుంటున్నారు. 🚇 అయితే పీక్ అవర్స్ లో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

🌐 ప్రస్తుతం నగరంలో ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. 👀 దీనికి తోడూ మెట్రో స్టేషన్స్, రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. 👩‍💼 మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు వెళ్లే వారు ఆర్టీసీ ప్రీ జర్నీనీ వాడుకుంటున్నారు. 🚇 మరో వారం పది రోజుల్లో మెట్రో రైళ్లలో డైలీ రైడర్ షిప్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 📆

bottom of page