top of page
MediaFx

సేల్స్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుందా..?


జాబితా చేసుకోవడం సేల్‌లో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తుల జాబితాను రూపొందించుకోవాలి. ఇది మీకు అవసరమైన వస్తువులపై మాత్రమే దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. అలాగే ఆన్-సైట్‌లో అందించే వివిధ రకాల డిస్కౌంట్‌ల వైపు మనస్సు మళ్లకుండా ఉంటుంది. మీరు ఇంట్లో అవసరమైన వాటిని రీస్టాక్ చేయడానికి లేదా గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు మీ ఆలోచనలకు తగ్గకుండా ముందుగానే జాబితా చేసుకోవడం ఉత్తమం. ధరలను సరిపోల్చడం సేల్స్ సమయంలో పెట్టిన ధర చాలా వరకు తక్కువగానే ఉంటుంది. అయితే పోటీ యాప్స్‌లో కూడా వాటి ధరలు ఎలా ఉన్నాయో? కొనుగోలు చేసే ముందు సరిపోల్చడం ఉత్తమం. కొన్నిసార్లు గణనీయమైన తగ్గింపు అనేది ఉత్తమ ఆఫర్ కాకపోవచ్చని, అందువల్ల కొనుగోలు చేసే ధరలను సరిపోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌ సేల్ సమయంలో మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువులకు ముందుగానే బడ్జెట్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అధిక ఖర్చు నుంచి దూరంగా ఉండవచ్చు. మీకు కావాల్సిన వస్తువులు మీ బడ్జెట్‌లోనే జాబితా చేయడం వల్ల మీరు అధికంగా ఖర్చు పెట్టకుండా ఉంటారు.  అదనపు కూపన్లు ముందుగా అందించే డిస్కౌంట్‌కు మించి బ్యాంక్ కార్డ్‌లపై అదనపు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు కనీస కొనుగోలు మొత్తాన్ని చేరుకున్న తర్వాత అనేక కూపన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. చెక్ అవుట్ చేస్తున్నప్పుడు వీటిని వర్తింపజేయడం వల్ల మీరు అదనంగా ఆదా చేసుకోవచ్చు. లైట్‌నింగ్ డీల్స్ అన్ని షాపింగ్ యాప్స్‌లో లైట్నింగ్ డీల్స్ అందిస్తూ ఉంటాయి. ఇవి లిమిటెడ్ టైమ్ డీల్స్‌గా ఉంటాయి. అందువల్ల మీరు కొనుగోళ్లల్లో పొదుపు చేయాలనేకుంటే ఈ లైట్నింగ్ డీల్స్ సమయంలో కొనుగోలు చేస్తే అధికంగా ఆదా చేయవచ్చు. 

bottom of page