top of page
Shiva YT

🔍📰 కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల లొల్లి.. 🚫🍪

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల గొడవ రాజుకుంది. జార్ఖండ్‌ జోడో యాత్రలో రాహుల్‌ కుక్కలు తినే బిస్కెట్లను కార్యకర్తతో తిన్పించారని బీజేపీ ఆరోపించింది. కుక్కలంటే బీజేపీ నేతలకు ఎందుకు అంత భయం అని రాహుల్‌ ఎదురుదాడికి దిగారు.

జార్ఖండ్‌ లోని కుంతీలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ యాత్రలో భాగంగా జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా విడుదలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ కారు పైకప్పుపై కూర్చుని కుక్కకు బిస్కెట్లు తినిపించారు. కుక్క బిస్కెట్లు తినకపోవడంతో.. పక్కనే ఉన్న ఓ కార్యకర్తకు రాహుల్ బిస్కెట్ ఇచ్చారు. ఈ వీడియో విషయంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతంగా ఘాటుగా స్పందించారు.

అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోలో పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ.. ఆ కుక్క వాటిని తినకపోవడంతో ఆ బిస్కెట్లను పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చారు. అయితే కుక్క బిస్కెట్లను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చి తినమని చెప్తున్నారని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. 📢🍪


bottom of page