top of page
MediaFx

మీ ఫోన్‌ కెమెరాను కాపాడుకోవాలంటే ఇలా చేయకండి..

మీకు ఉపయోగపడే మొబైల్ కెమెరా మీరు తెలియక చేసే చిన్న పొరపాటు వల్ల ఫోన్ కెమెరా పాడైపోవడం లేదా శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా. జాగ్రత్తలు తీసుకోకపోతే, ఫోన్ కెమెరాను శాశ్వతంగా పాడు చేసే అంశాల గురించి తెలుసుకుందాం.

ఫోన్ కెమెరాలు పాడవకుండా నిరోధించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి: ప్రజలు లొకేషన్‌ను కనుగొనడానికి జీపీఎస్‌ని ఉపయోగించడం తరచుగా కనిపిస్తుంటుంది. ఇందుకోసం బైక్‌పై ఫోన్‌ను ఫిక్స్‌ చేస్తారు. అయితే దీని వల్ల ఫోన్ కెమెరా పాడవుతుందని వారికి తెలియదు. వాస్తవానికి, బైక్ లేదా స్కూటర్ కదిలినప్పుడు చాలా వైబ్రేషన్ వస్తుంటుంది. ఇది కెమెరాను ప్రభావితం చేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ కెమెరాను రక్షించడానికి ప్రత్యేక మౌంటు కిట్‌ని ఉపయోగించండి.

ఇది కాకుండా, కొంతమంది మంచి ఐపీ రేటింగ్ కారణంగా మొబైల్‌తో నీటిలోకి వెళతారు. కెమెరా లెన్స్‌లో నీరు చేరితే అది ఎప్పటికైనా పాడైపోతుంది. మీరు కచేరీకి లేదా లైవ్ షోకి వెళ్లినప్పుడల్లా లేజర్ కిరణాల సమయంలో ఫోటోలు క్లిక్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. లేజర్ కాంతి కారణంగా కెమెరా లెన్స్ దెబ్బతింటుంది.

అలాగే సూర్యగ్రహణం సమయంలో చాలా మంది ఫోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తుంటారు. ఇది సరైనది కాదు. ఇది లెన్స్‌ను ప్రభావితం చేయవచ్చు. బలమైన సూర్యకాంతిలో కూడా ఫోన్ కెమెరాను ఉపయోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు.


bottom of page