స్కిల్ డవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో సరైన సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు.
స్కిల్ డవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో సరైన సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవని.. రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇటు చంద్రబాబు.. అటు సీఐడీ తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 19 కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు కోరగా.. సోమవారం (సెప్టెంబర్ 18) వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.