top of page
MediaFx

ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి..


గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు. మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గలిజేరులో తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని రెండు రకాలు ఉంటాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయి నాణెం సైజులో ఉంటాయి. ఔషధ గుణాలు రెండింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే దీనిని ‘పునర్నవ’ అంటారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

bottom of page