top of page
Suresh D

మాకు థియేటర్లు ఇవ్వట్లేదు.. ఇది గుప్తాధిపత్యమా లేదంటే వివక్షా..? 🗣️🎥

హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇవ్వడానికి హైదరాబాదులో చాలామంది ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నా కూడా ఇవ్వనివ్వడం లేదు అంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నా హనుమాన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న సినిమా ఇదొక్కటే కాబట్టి. దీనికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ చాలా రోజులనుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో థియేటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాకే చెప్పుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇవ్వడానికి హైదరాబాదులో చాలామంది ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నా కూడా ఇవ్వనివ్వడం లేదు అంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి ముందు ప్రశాంత్ వర్మ కూడా తమ సినిమాను వాయిదా వేసుకోవాలి అంటూ కొంతమంది బెదిరిస్తున్నారని.. అయితే ఆయన ఎవరో తెలియదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఇప్పుడు నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా హనుమాన్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటున్నాడు. తమకు హైదరాబాదులో ఉన్న మొత్తం థియేటర్స్ అడగడం లేదని.. 76 సింగిల్ స్క్రీన్స్ ఉంటే కనీసం మా సినిమాకు తగ్గట్టు ఒక 15 నుంచి 20 థియేటర్లు మాత్రమే అడుగుతున్నాము అంటున్నాడు నిరంజన్ రెడ్డి. కానీ ఉన్న 76 థియేటర్లలో 70 ఒకరే తీసుకుంటే.. దానిని గుత్తాధిపత్యం అంటారా లేదంటే వివక్ష చూపించడం అంటారా అనేది మీరే చెప్పాలి అంటున్నాడు ఈయన. అంతేకాదు హైదరాబాదులో చాలామంది థియేటర్ ఓనర్లు తమకు హనుమాన్ సినిమా వేసుకోవాలని ఉంది అంటున్నారని.. కాకపోతే వాళ్ళను వేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత.

జనవరి 12న గుంటూరు కారంతో పాటు విడుదలవుతుంది హనుమాన్. ఎదురుగా మహేష్ బాబు సినిమా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఎక్కువ థియేటర్లు వెళ్తాయనే విషయం తమకు కూడా తెలుసు అని.. కాకపోతే తమకేమీ రికార్డు నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవసరం లేదని.. కనీసం మా సినిమా వచ్చినట్టు తెలిసేలా కొన్ని థియేటర్లు మాత్రమే అడుగుతున్నాము అంటున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. ఈయన గోడు తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా వింటున్నారు. అయితే దానికి ఎలాంటి సమాధానం చెప్తారు అనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే అక్కడ గుంటూరు కారం వెనక ఉన్నది దిల్ రాజు. ఇప్పటికే హైదరాబాదులో 90% థియేటర్లో గుంటూరు కారం సినిమా కోసం దిల్ రాజు బ్లాక్ చేశాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ ఇందులో నిజం ఉంటే మాత్రం హనుమాన్ నిర్మాత చెప్తున్న విషయాలన్నీ నిజమే అనుకోవాలి. ఏదేమైనా రేపు సినిమా విడుదలైన తర్వాత ఏ సినిమా మూడు రోజులు ఆడుతుంది.. ఏ సినిమా లాంగ్ రన్ వెళ్తుంది అనేది జనాలు డిసైడ్ చేస్తారు.. కంటెంట్ ఎవరికి బాగుందనేది కూడా వాళ్లే తెలుసుకుంటారు అంటున్నాడు నిరంజన్ రెడ్డి. మా సినిమాకు సింగిల్ థియేటర్లు లేకుండా చేస్తారు కానీ.. అసలు థియేటర్లలో లేకుండా చేయలేరు కదా.. వచ్చే విజయాన్ని ఆపలేరు కదా అంటున్నాడు ఆయన. అంతేకాదు హనుమాన్ సినిమాను జనవరి 11 లేదా 14 కు వాయిదా వేసుకోవాలని దిల్ రాజు తమకు సూచించాడని.. కాకపోతే ఆల్రెడీ అగ్రిమెంట్స్ అన్నీ పూర్తవ్వడంతో కచ్చితంగా 12 కు రావాల్సిన ఆవశ్యకత తమ సినిమాకు ఉంది అంటున్నాడు ఈ నిర్మాత.🗣️🎥

bottom of page