అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందులోనూ మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలని.. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. ఇందు కోసం ఎక్కువగా చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్లు, కాస్మెటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా ఇన్ని చేసినా కూడా ముఖంపై గులాబీ రంగు రావాలంటే చాలా కష్టం.
రోజ్ గ్లో కోసం చాలా మంది ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీములు ఉపయోగిస్తారు. ఇలాంటివి చర్మానికి కూడా ప్రమాదకరం. వీటితో ఎప్పటికైనా భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. డబ్బులు కూడా వృధా అవుతాయి.
కాస్త సమయం కేటాయిస్తే ఇంట్లోనే ఈజీగా గులాబీ మెరుపు ఇచ్చే జెల్ తయారు చేసుకోవచ్చు. ఇది రాసుకోవడ వల్ల మీ ముఖం రోజ్ గ్లోతో మెరిసి పోతుంది. మరి ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజ్ తయారు చేసుకోవడానికి గులాబీ రేకులు, అలోవెరా జెల్, విటమిన్ సి క్యాప్సూల్స్, రోజ్ వాటర్ కావాలి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి గులాబీ రేకులు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా మిక్సీ పట్టాలి. వీటిని వడకడితే రసం వస్తుంది.
ఈ రసంలో అలోవెరా జెల్, విటమిన్ సి క్యాప్సూల్స్ కలపాలి. అంతే రోజ్ జెల్ సిద్ధం. వీటిని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖం కడిగి రాసుకోవాలి. పది రోజుల్లోనే మీ ముఖంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.