యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న ఆ ఇద్దరినీ ఈ చిత్రం మళ్లీ హిట్ బాటపట్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. రామ్ - పూరి కాంబోలో 2019లో వచ్చిన సూపర్ హిట్ మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా వస్తుండటంతోనే డబుల్ ఇస్మార్ట్ ఈ రేంజ్‍లో క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రం నుంచి రెండో పాట నేడు (జూలై 16) రిలీజ్ అయింది. డబుల్ ఇస్మార్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన స్టెప్పా మార్ పాట ఊపేస్తోంది. ఫుల్ నాటు మాస్ బీట్‍తో వచ్చిన ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు వచ్చిన మార్ ముంత.. తోడ్ చింత సాంగ్ కూడా ఇదే జోరుతో ఉంది. ఈ మూవీకి పాటతోనే మరింత హైప్ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. బానీ జే, అలీ, గెటప్ శ్రీను, షాయాజీ షిండే, మార్కండ్ దేశ్‍పాండే, వంశీ, ఉత్తేజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మూవీ రిలీజ్ డేట్
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఏడాది మార్చిలోనే రావాల్సిన ఈ చిత్రం ఆలస్యమైంది. షూటింగ్ కొన్ని రోజులు నిలిచిపోయింది. అయితే, మళ్లీ మొదలవగా శరవేగంగా పూర్తయింది. పుష్ప 2 వాయిదా పడడంతో ఆగస్టు 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.