వెనుకకు నడవడం వల్ల ఒకటి, రెండూ కాదు.. అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రివర్స్ వాకింగ్ క్రమం తప్పకుండా చేయటం వలన మోకాళ్లు, కాళ్ల వెనుక కండరాల వశ్యత పెరుగుతుంది.
అలాగే, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రివర్స్ వాకింగ్ వల్ల దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది.వెనుకకు నడవటం వల్ల శరీరంపై ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. స్ట్రెయిట్ వాకింగ్‌తో పాటు, రివర్స్ వాకింగ్ మీ శరీరానికి, మనస్సుకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మీ మనస్సు, శరీరానికి మధ్య మంచి సమతుల్యతను సృష్టిస్తుంది. కానీ వెనుకకు నడిచేటప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, రద్దీగా ఉండే ప్రదేశం, జంతువులు, ఇతర వస్తువులు, వాహనాలు మీ వెనుక ఉండకుండా జాగ్రత్త వహించండి.అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.