BMW కంపెనీ పూర్తి రూపం, దాని లోగోలో దాగి ఉన్న రహస్యం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వేధికగా చాలా మంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. చాలా మంది వ్యక్తులు BMW పూర్తి పేరు ఏమిటి? అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు. అలాగే, BMW పేరుతో చాలా కార్లు రోడ్లుపై చక్కర్లు కొట్టడం చూస్తుంటారు. సినిమాల్లోనూ చూస్తుంటారు. కానీ, అందులో ఆ కారు మోడల్ ఏంటో చాలా మందికి తెలియదు. అయితే BMW 3 సిరిస్, BMW 5 సిరిస్, BMW X5, BMW X1, BMW 7 సిరిస్, BMW XM, BMW i4 వంటి చాలా కార్లే ఉన్నాయి. కానీ చాలా వరకు బీఎండబ్ల్యూ అనే చెబుతారు. కానీ, దాని పూర్తి పేరును ఎవరూ స్పష్టంగా చెప్పలేరు.
అసలు విషయం ఏంటంటే.. బీఎండబ్ల్యూ జర్మనీకి చెందిన కార్లు, బైక్స్ తయారీ సంస్థ. 1916లో జర్మనీలోని మ్యూనిచ్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటైన మొదట్లో విమానాల ఇంజిన్లను తయారుచేసేది. దీని పేరు కూడా అంటే..BMW ను జర్మనీ భాషలో బేయిరిస్చే మోటోరెన్ వర్కే జిఎంబీహెచ్ (Bayerische Motoren Werke GmbH), అంటే ఇంగ్లీష్‌లో బవేరియన్ ఇంజిన్ వర్క్స్ కంపెనీ అని అర్థం. BMW సంస్థ బవేరియా రాష్ట్రంలో ఏర్పాటుచేశారు. కనుక మొదటి పదంగా దాన్ని చేర్చారు.. కంపెనీ స్వతహాగా ఇంజిన్ తయారీ సంస్థ కాబట్టి రెండో పదం మోటర్ అని ఉంచారు. 1981లో సంస్థ పేరులో కొద్ది మార్పులు చేశారు. ప్రస్తుతం BMW – Bayerische Motoren Werke GmbH తోనే సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.