వాస్తు అనేది ఇంటికే కాకుండా.. ఇంట్లో ఉండే వస్తువులకు కూడా ఉంటుంది. వస్తువులను పెట్టే దిక్కుల బట్టి ఇంటికి నష్టం, లాభం అనేవి చేకూరుతాయి. వాస్తు ప్రకారం ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులను ఎక్కడ ఉంచితే ఇంటికి మంచిదో తెలుసుకున్నాం.
ఇప్పుడు గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితో ఇంటికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. గడియారాన్ని ఉంచిన స్థానం బట్టి కూడా.. ఇంటిపై ప్రభావం పడుతుంది. చాలా మంది గడియారాలను అందంగా ఉండాలని ఇష్టం వచ్చిన చోట పెడుతూ ఉంటారు.
గడియారాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంపద అనేది పెరుగుతుందట. ఎందుకంటే ఉత్తర దిశకు కుబేరుడు, వినాయకుడు అధిపతి అని పురాణాల్లో ఉంది. అదే విధంగా ఇంటి గడియారాన్ని ప్రవేశ ద్వారంపై పెడితే.. చాలా సమస్యలని తెచ్చి పెడుతుందట.
అదే విధంగా గడియారాన్ని దక్షిణ దిక్కులో ఉంచడం వల్ల కూడా ఇంట్లో చాలా సమస్యలు ఎదురవుతాయట. ఎందుకంటే దక్షిణ దిశకు యముడు అధిపతి. కాబట్టి ఈ దిశలో గడియారాన్ని పెడితే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. అందుకే ఈ దిశలో గడియారాన్ని ఉంచకండి.
అలాగే గడియారాన్ని తూర్పు దిశలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎందుకంటే సూర్యడు ఈ దిక్కులోనే ఉదయిస్తాడు. బెడ్‌రూమ్‌లో గడియారం ఉంచడం వల్ల దంపతుల మధ్య తగాదాలు వస్తాయి.