top of page
Suresh D

శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా..? రామచంద్రుడు పేరు ఎలా వచ్చింది..


రఘుకుల గురువైన మహర్షి వశిష్టుడు దశరథ మహా రాజు పెద్ద కుమారుడికి శ్రీరాముడు అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన తర్వాత అతనికి దశరథ రాఘవ అని పేరు పెట్టారు.“ఓం నమో నారాయణాయ నమః” అనే మంత్రం నుంచి “రా” అనే అక్షరాన్ని “ఓం నమః శివాయ” నుంచి “మ” అనే అక్షరాన్ని ఎంచుకొని ఆ రెండింటినీ కలిపి రామ అనే పేరుని పెట్టారు. రామ అనే రెండు అక్షరాలు అత్యంత శక్తివంతమైన తారక మంత్రం. గురువు వశిష్ట చెప్పిన దాని ప్రకారం రామ అనే పదం రెండు బీజాంశాలతో రూపొందించబడింది. అగ్ని బీజమ్, అమృత బీజమ్ రెండింటినీ కలిపితే వచ్చే పదమే ఈ రామ.రామ అనే రెండు అక్షరాలు నిత్యం పఠించడం వల్ల ఆత్మ, మనసుకు బలాన్ని ఇస్తుంది. శ్రీరాముడికి మాత్రమే కాకుండా అతని సోదరులైన భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడికి కూడా వశిష్టుడే పేరు పెట్టాడు.బాలరాముడిని చూసేందుకు దేవుళ్ళతో సహా అందరూ మనుషులు వేషంలో వచ్చారని చెబుతారు. దేవతలు ఒక్కొక్కరుగా ఉయ్యాల దగ్గరకు వచ్చి ఎవరికీ తెలియకుండా మౌనంగా స్వామి వారికి నమస్కారాలు చేశారు. సూర్యదేవుడి వంతు వచ్చినప్పుడు సూర్యవంశంలో జన్మించినందుకు శ్రీరాముడికి భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. సూర్యుడి కృతజ్ఞతలను బాలుడి రూపంలో ఉన్న భగవంతుడు చిరునవ్వుతో అంగీకరించాడు. ఒక్కొక్కరిగా శ్రీరాముడిని దర్శించుకుంటూ ఉండగా చంద్రుడి వంతు వచ్చింది. అయితే అతని ముఖంలో చాలా విచారం కనిపించింది. భగవంతుడు అతనితో ఏమైంది ఎందుకు విచారంగా కనిపించావని అడిగాడు. అప్పుడు తనని నిర్లక్ష్యం చేశారని సూర్యభగవానుడికి అంతటి ప్రాధాన్యత ఇచ్చి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకే కలత చెందినట్లు చంద్ర భగవానుడు చెప్తాడు.చంద్రుడి బాధను అర్థం చేసుకున్న భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో చంద్రవంశంలో తాను జన్మిస్తానని చెప్తాడు. అయితే త్రేతాయుగం ముగిసి ద్వాపరయోగం ప్రారంభం అవ్వడానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉందని చంద్రుడు బాధపడతాడు. దీంతో భగవంతుడు చిరునవ్వు నవ్వి సరే ఈరోజు నుంచి నా పేరు రామాకి తోడు చంద్ర అని కూడా చేర్చుకుంటాను. ప్రజలు నన్ను రామచంద్ర అని సంబోధిస్తారని చెప్తాడు. ఈ మాట చెప్పగానే చంద్రుడు చాలా సంతోషిస్తాడు. అలా శ్రీరాముడిని రామచంద్రుడు అని కూడా పిలుస్తారు.





bottom of page