ప్రపంచవ్యాప్తంగా నిత్యం గుండెపోటుతో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో ప్రతి 40 సెకన్లకు ఒకరికి గుండెపోటు వస్తోంది. గుండెపోటు సాధారణమైంది కాదు.. చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే చాలామంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్నా గుండెపోటు బారిన పడుతుంటారు. అయితే గుండెపోటు రాకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకొండి.
ప్రపంచవ్యాప్తంగా నిత్యం గుండెపోటుతో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో ప్రతి 40 సెకన్లకు ఒకరికి గుండెపోటు వస్తోంది. గుండెపోటు సాధారణమైంది కాదు.. చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే చాలామంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్నా గుండెపోటు బారిన పడుతుంటారు. అయితే గుండెపోటు రాకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకొండి. గుండెపోటు రాకుండా ఉండాలంటే వాటి సాంకేతాలు తెలుసుకోవాలని, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న అలవాట్లకు గుడ్ బై చెప్పాలని సూచిస్తున్నారు. ఈ మేరకు డాక్టర్ గ్రెగొరీ పొంటోన్, MD MBA, కార్డియాలజిస్ట్, వైట్ ప్లెయిన్స్ హాస్పిటల్‌లోని అంబులేటరీ క్వాలిటీ అండ్ ఫిజిషియన్ సర్వీసెస్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ ప్రకారం, ఐదు ప్రాథమిక అంశాలు ఎవరైనా గుండెపోటుకు గురయ్యే అంశాల గురించి వివరంగా తెలియజేశారు.
65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ పొంటోన్ వివరించారు. ఎందుకంటే కాలక్రమేణా ధమని గోడలలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. చివరికి ఈ సంచిత నష్టం ప్రమాదకరంగా ఉంటుంది. ఫలితంగా గుండెపోటు, గుండె జబ్బులు ఎక్కువగా ఉంటుంది. ఇక మహిళలతో పోలిస్తే పురుషులు సాధారణంగా గుండెపోటు ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే మెనోపాజ్ తర్వాత మహిళలకు ప్రమాదం పెరుగుతుంది” అని డాక్టర్ పొంటోన్ చెప్పారు. అలాగే జన్యు కారణాలతోనూ గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. బీపీ, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు తదితర వైద్యపరమైన కారణాలు కూడా గుండెపోటు రిస్క్‌ని పెంచుతాయి. మరోవైపు జీవనశైలి కూడా గుండెపోటు వచ్చేందుకు కారణం కావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండెపోటు రిస్క్ తగ్గాలంటే..
గుండెపోటు రిస్క్ తగ్గాలంటే ముఖ్యంగా ఓ అలవాటును వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే ధూమపానం అలవాటు. గుండె ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లలో ధూమపానం చాలా ప్రధానమైనదిగా ఉంది. ధూమపానం రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటుకు కారణం అవుతోంది. పురుషులు ఎక్కువగా ధూమపానం చేస్తున్నందున వారిలో గుండెపోటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటోంది. మీరు పొగతాగడం మానేస్తే.. ప్రతి కాల్చని ప్రతి సిగరెట్ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అందుకే ధూమపానం అలవాటును మానేస్తే గుండెపోటు సమస్యను చాలా వరకు నివారించొచ్చని సూచిస్తున్నారు.😷🚭