top of page
MediaFx

హీరో కాలనీలో డ్రైనేజీ లీక్‌ !! రాజశేఖర్ సంచలన ట్వీట్


హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ ప్రముఖ సినీ నటుడు సంబంధిత అధికారులను కోరారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్‌ సమస్య చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, దీని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీరియస్గా ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని కోరుతూ.. అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు అలాగే తన పోస్టుకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, కమిషనర్ తో పాటు తదితర ఉన్నతాధికారలను ట్యాగ్‌ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా నితిన్ ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లో ఒక కీలక పాత్రలో మెరిశారు డాక్టర్ రాజశేఖర్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. పెద్దగా ఆ సినిమాతో బజ్ చేయలేక పోయాడు ఈ స్టార్.

bottom of page