కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలలో ఒకటి. కాటేసిందంటే క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. అంతటి భారీ కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తేనే మనిషి పైప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది దాన్ని దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.? ఈ మధ్యకాలంలో సరీసృపాలు జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సందు దొరికితే చాలు.. ఏదొక మూలాన దాక్కుని మనుషులను బెదరగొడుతున్నాయి. ఇటీవల ఓ 18 అడుగుల కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా దెబ్బకు దడుసుకున్నారు. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన డ్రైనేజీ పైప్ మరమ్మత్తుల పనులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారికి పైప్ గుండా కదులుతూ ఓ వింత ఆకారం కనిపించింది. వారు భయం.. భయంగానే బెదురుతూ వెళ్లి చూశారు. ఇక అక్కడ కనిపించిన షాకింగ్ దృశ్యానికి వారి మైండ్ బ్లాంక్ అయింది. లోపల 18 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. ఇక అతికష్టం మీద దాన్ని సుమారు రెండున్నర గంటల పాటు కష్టపడి దానిని.. చాకచక్యంగా బంధించారు. దీంతో స్థానికులు హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.