top of page
MediaFx

మీ ఐఫోన్ డ్రీమ్‌ నిజం చేసుకునే ఛాన్స్‌..


ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే బడ్జెట్‌ కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. ఐఫోన్ అంటేనే ఎక్కువ ధర ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అలాంటివి మరి. ఐఫోన్‌ కొనుగోలు చేయాలనే ఆశ ఉండి, బడ్జెట్‌ సహకరించని వారికి బంపరాపర్‌ ఇచ్చింది ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌.

అమెజాన్‌ ప్రస్తుతం గ్రేట్ సమ్మర్‌ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అమెజాన్‌లో అందిస్తున్న ఆ ఆఫర్‌ ఏంటి.? ఇంతకీ ఐఫోన్‌13లో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్‌ ఐఫోన్‌ 13 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 59,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 19 శాతం డిస్కౌంట్‌తో రూ. 48,499కి అందుబాటులో ఉంది. దీంతో పాటు అమెజాన్‌ పే బ్యాక్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు క్యాష్‌బాక్‌ను పొందొచ్చు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా ఐఫోన్‌ 13పై ఏకంగా రూ. 44,650 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటినీ ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ రికార్డింగ్ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 19 గంటల వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్‌ చిప్‌ను అందించారు.

bottom of page