top of page
MediaFx

మహేష్ బాబు వద్దన్న కథలతో సూర్య చేసిన సినిమాలు🎥✨

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమాకు మంచి టాక్ రాలేదు. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కొడతాడంటూ ప్రిన్స్ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాలు ఈ సినిమాకే కేటాయించాల్సి వస్తోంది. రెండు భాగాలుగా రానుందా? లేదంటే ఒక భాగంగా వస్తుందా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో ఎంతోమంది దర్శకులు తాము తయారుచేసుకునే కథలను మహేష్ బాబు ను దృష్టిలో పెట్టుకొని చేస్తామని బహిరంగంగా చెప్పేవారు. అలా ఎన్నో కథలు ప్రిన్స్ దగ్గరకు వచ్చేవికావని కొన్ని కారణాలవల్ల ఆయన తిరస్కరించడంతో అవి వేరే హీరోలతో తెరకెక్కేవి. అలా కొన్ని తిరస్కరించిన కథలతో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య మూడు సినిమాలు చేశారు. వాటిల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవగా ఒకటి మాత్రం నిరాశపరిచింది. 

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూర్య చేసిన ఘటికుడు సినిమా ముందుగా మహేష్ బాబు దగ్గరకే వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు రెండు భాషల్లో తీయాలనుకున్నాడుకానీ ప్రిన్స్ తిరస్కరించడంతో తమిళంలో సూర్యతో చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ముందుగా దీన్ని మహేష్ బాబు దగ్గరకు తీసుకువచ్చాడు. కథ నచ్చకపోవడంతో మహేష్ బాబు తిరస్కరించాడు. దీంతో సూర్య కథానాయకుడిగా తెరకెక్కి తెలుగు, తమిళంలో విజయాన్ని అందుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా కూడా మహేష్ బాబు దగ్గరకే వచ్చింది. కథ నచ్చినప్పటికీ అందులో ఉన్న పాత్రల ఆహార్యాన్ని, విభిన్నతను తాను ఊహించుకోలేక తిరస్కరించాడు. తర్వాత సూర్యతో తెరకెక్కి మంచి పేరు తెచ్చుకుంది. 🎥✨

bottom of page