top of page
Suresh D

ఆసక్తినిరేపుతున్న 'డంకి' .. ట్రైలర్ రిలీజ్🌟🎥

ప్రస్తుతం షారుక్ ఖాన్ మంచి జోరుమీదున్నాడు. ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో ఆయన సతమతమైపోయాడు. ఆ తరువాత ఆయన చేసిన 'పఠాన్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఇటీవల వచ్చిన 'జవాన్' కూడా దాదాపు అదే స్థాయిలో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో షారుక్ నుంచి xరావడానికి ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది .. అదే 'డంకి'. షారుక్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకు, రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. 🌟🎥




bottom of page