సలార్, డంకీ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధించబోతున్నారు? ఈ ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్ ఖానా లేక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాసా? ట్రేడ్ పండితులు విజేతను తేల్చేశారు.
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద ఫైట్ జరగడానికి సమయం దగ్గరపడుతోంది. సలార్, డంకీ మూవీస్ ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కానుండటంతో ఈ రెండు మూవీస్ లో ఏది పైచేయి సాధిస్తుందో అన్న ఆసక్తి అంతటా నెలకొంది. ప్రభాస్ సలార్, షారుక్ ఖాన్ డంకీ మధ్య జరగబోయే ఈ ఫైట్ లో విజేత ఎవరో ట్రేడ్ పండితులు అప్పుడే తేల్చేశారు.
షారుక్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21న.. ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు రూ.1000 కోట్ల సినిమాలు అందించిన షారుక్ ఖాన్ ఊపు మీదున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ ఫ్లాపులతో ఢీలా పడిన ప్రభాస్.. ఈ సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లలో పైచేయి ఎవరిది?
హ్యాట్రిక్ ఫ్లాపులైనా కూడా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని అతని అభిమానుల వాదన. పైగా సలార్ ఓ మాస్ యాక్షన్ మూవీ. ఈ నేపథ్యంలో కచ్చితంగా సలార్ దేపైచేయి సాధిస్తుందన్న నమ్మకంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ట్రేడ్ పండితులు మాత్రం సలార్ కంటే డంకీనే ఎక్కువ వసూళ్లు సాధించనుందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఈ ఏడాది పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ లాంటి యాక్షన్ సినిమాలు వచ్చాయని, అసలుసిసలు ఫ్యామిలీ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్ డంకీ వైపే చూస్తారని ట్రేడ్ ఎక్స్‌పర్ట్ అతుల్ మోహన్ అభిప్రాయపడుతున్నాడు. అటు నార్త్ లోని ఎగ్జిబిటర్లు కూడా ఇదే చెబుతున్నారు.
ప్రభాస్‌కి ఉన్న స్టార్‌డమ్ తో సలార్ కు రికార్డు ఓపెనింగ్స్ ఖాయం. అయితే దీర్ఘకాలంలో మాత్రం సలార్ కంటే డంకీయే ఎక్కువ సక్సెస్ సాధిస్తుందని ఎగ్జిబిటర్లు అంటున్నారు. రాజ్ కుమార్ హిరానీ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లడం కాకుండా ఎక్కువ కాలంపాటు బాక్సాఫీస్ ను ఏలుతాయన్న గత రికార్డును వాళ్లు గుర్తు చేస్తున్నారు.
నార్త్ వెర్సెస్ సౌత్😎✨
సలార్, డంకీ సినిమాలతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో నార్త్ వెర్సెస్ సౌత్ చర్చ మొదలైంది. ప్రభాస్ సౌతిండియాలో సూపర్ స్టార్ కాగా.. నార్త్ లో షారుక్ ఖాన్ దే పైచేయి. ఈ ఏడాది వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు అదే నిరూపించాయి. ఈ రెండు సినిమాలు తొలి రోజే రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ఇంట్రెస్టింగ్ విశ్లేషణ చేశాడు.🎥✨
"రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు తగ్గనున్నాయి. రెండు సినిమాలు ఒకదాని బిజినెస్ మరొకటి దెబ్బకొట్టబోతున్నాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు నమోదు కాకపోవచ్చు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితేనే రికార్డులు బ్రేక్ అవుతాయి.
రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే షోలు డివైడ్ అవుతాయి. దీంతో ఈ సినిమాలకు జవాన్, పఠాన్, ఆర్ఆర్ఆర్ స్థాయి ఓపెనింగ్స్ రాకపోవచ్చు. అయితే పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ సినిమాలు తర్వాతి రోజుల్లో కాస్త కోలుకుంటాయి. అది కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది" అని రమేష్ బాల అనడం గమనార్హం.
ప్రస్తుతానికి సౌత్ లో సలార్, నార్త్ లో డంకీ భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ సలార్ కు భారీ ఓపెనింగ్స్ ఖాయం. అయితే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో స్క్రీన్ల విషయానికి వస్తే ప్రభాస్ కంటే షారుక్ ఖాన్ కే ఎక్కువ దక్కే సూచనలు ఉన్నాయి.
రెండు వరుస సూపర్ డూపర్ హిట్స్ అందించిన షారుక్ వైపే థియేటర్ల యజమానులు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ వాదన. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ రంజుగా ఉంటుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.🎥✨