top of page
MediaFx

దుమ్మురేపిన దేవర సాంగ్.. 24 గంటల్లోనే నయా రికార్డ్ ..


తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది.. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లె సాంగ్ మూడవ స్థానంలో నిలిచింది.. ఈ పాటకు 15.68 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్40 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతోందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు తెలుస్తోంది ఇంకా ఈ సినిమాకి 120 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్నట్లు సమాచారం.



bottom of page