ప్రభాస్‌లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా.. ఏ ఒక్క సినిమాకు మరోదానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్. గతేడాది ఆదిపురుష్ డివోషనల్ అయితే.. సలార్ పూర్తిగా మాస్ సినిమా.దానికి ముందు రాధే శ్యామ్ లవ్ స్టోరీ.. సాహో పక్కా యాక్షన్ బొమ్మ. ఇలా ప్రతీదీ దేనికదే విభిన్నం. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. కల్కి సైన్స్ ఫిక్షన్‌తో కూడిన టైమ్ ట్రావెల్ అయితే.. రాజా సాబ్‌లో ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు మారుతి.
వీటి తర్వాత సలార్ 2 మాస్ ఎంటర్‌టైనర్ కాగా.. ప్రభాస్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు హను రాఘవపూడి. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాకు కూడా కమిటయ్యారు ప్రభాస్. ఇందులో పాత ప్రభాస్ వద్దు.. పూర్తిగా మార్చేస్తానంటున్నారు వంగా.బేసిక్‌గానే తన సినిమాల్లో హీరో కారెక్టరైజేషన్‌ను కొత్తగా డిజైన్ చేస్తారు సందీప్. మత్తు పదార్థంలా ఆడియన్స్‌ను అది ఓ పట్టాన వదలదు. అందుకే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు ప్రభాస్.
యాక్షన్ మాత్రమే కాదు.. ఇందులో రొమాన్స్ కూడా బాగానే ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ కోసం యూనిక్ కారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్ వంగా. ఫ్యాన్స్ కోరుకునే మాస్‌తో పాటు సరికొత్త ప్రభాస్‌ను పరిచయం చేయబోతున్నారు ఈ దర్శకుడు. 2024లోనే స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది.