top of page
MediaFx

అనుకున్నదానికంటే ముందుగానే కల్కి -2..


‘కల్కి 2898 AD’ సినిమా జూన్ 27న విడుదలయ్యింది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొదటి భాగానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అయితే రెండో భాగానికి ఎక్కువ సమయం పట్టదని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. కల్కి రెండో భాగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొదటి భాగం షూటింగ్ జరుగుతుండగా, రెండో భాగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. దాదాపు 20 రోజుల షూటింగ్ పూర్తయింది. ఇంకా చాలా ఆలోచించి చేయాల్సిన పని ఉంది. ఈ సినిమా మొదటి భాగానికి పట్టినంత సమయం తీసుకోదు’ అని అన్నారు. దాంతో ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే విడుదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని ఫిబ్రవరి 2020 నెలలో ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత దర్శకుడు సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ‘కల్కి2’ సినిమా కనీసం మరో రెండేళ్లలో అయినా పడుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహాన్ని తెచ్చిపెట్టాయి.


bottom of page