top of page

అమెరికాలో భూకంపం..

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ రీజియన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని న్యూయార్క్‌ మేయర్‌ ప్రతినిధి పేర్కొన్నారు.న్యూయార్క్‌లో భూకంపాలు సంభవించడం అత్యంత అరుదు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజా యుద్ధంపై భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా, భూకంపం సంభవించడంతో సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు.



 
 
bottom of page