ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి.
తమ పార్టీ అధికారం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి. తాజాగా, ఎలెసెన్స్ సర్వే తన అంచనా ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారంలో ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వేను చేపట్టారు. 86,200 మందిని శ్యాంపిల్ సైజుగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 127 విజయం సాధిస్తుంది. 50.38 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 48 స్థానాలను దక్కించుకుంటుంది. 45.58 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది. 1.38 ఓటు శాతం దక్కించుకుంది. ఇతరులకు కూడా సీట్లేవీ రావని, 2.66 శాతం ఓట్ షేర్ వీటికి అభ్యమైందన్నారు.