top of page
MediaFx

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ


రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీకి డిపాజిట్లు దక్కవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ , బీఆర్‌ఎస్ అంతర్గత అవగాహనతో కుట్ర పన్నుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఈ పార్టీలు చేతులు కలుపాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ. ఎన్డీయే-ఇండియా కూటమి తలపడుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలు ఏదో ఒక కూటమిలో చేరాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా ఇంటర్వ్యూలో కీలక సమాధానాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం తక్కువ అన్న రేవంత్‌ రెడ్డి, రూరల్‌లో పోటీ ఉన్నది బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే అన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు ఆరుగురు నన్ను కలిశారు. నేను తలచుకుంటే బీఆర్ఎస్‌కు ఆరుగురు అభ్యర్థులు ఉండేవాళ్లు కాదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీ చేస్తోందని అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు.

bottom of page