top of page

ఏనుగు బీభత్సం.. ఊరిమీద పడి విధ్వంసం…

MediaFx

ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాయి. వాటి రూపం మాత్రం భీకరంగా ఉంటుంది. వాటి ఆగ్రహం కూడా అంతే భయానకంగా ఉంటుంది. ఏనుగులు తెలివిలో మాత్రం వెరీ స్మార్ట్‌ అని చెప్పాలి. సోషల్ మీడియాలో తరచూ ఏనుగుల వీడియోలు చూస్తుంటాం. జూలో, సఫారి కోసం వెళ్లిన పర్యాటకులు అప్పుడప్పుడు ఏనుగు నుంచి తప్పించుకునే ఘటనలు కూడా చూస్తుంటాం. సోషల్ మీడియాలో ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఏనుగు చేసిన విధ్వంసం చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైరల్‌ వీడియోలో ఒక పెద్ద ఏనుగు అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. వస్తూ వస్తూనే ఎంతో ఆవేశంగా దూసుకొచ్చింది. రోడ్డుపై వేగంగా వచ్చే క్రమంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన బైకును ఒక్క తోపు తోసేసింది. దెబ్బకు ఆ బైకు దూరంగా ఎగిరిపడింది. తర్వాత అంతే ఆవేశంగా ఊళ్లోకి పరిగెత్తింది. రోడ్డు పక్కన ఉన్న ఒక ఆటోను కూడా తోసేసింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును కూడా తోసేయాలని ప్రయత్నించింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని రివర్స్ చేసి  చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. అలాగే ముందుకు వెళ్లిన ఏనుగు.. గ్రామంలోని ఇళ్లు, గుడిసెలను ధ్వంసం చేసింది. అంతటితో ఆగలేదు..ఓ రేకుల ఇంట్లోకి వెళ్లి ఇంటికి ఒకవైపు గోడను మొత్తం కూల్చేసింది. ఇదంతా దూరం నుంచి కొందరు స్థానికులు వీడియోలు తీశారు.



bottom of page