top of page
MediaFx

ఈ మదర్స్‌ డేని మీ అమ్మతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోండి..🌸



ప్రతి ఒక్కరూ ప్రపంచంలో రుణపడి ఉండే మొదటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మ కారణంగానే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అలాంటి తల్లులని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. అందుకోసమే ఆమెకంటూ ఓ రోజుని అంకితం చేసి మే నెలలో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సారి మే 12న మదర్స్ డే వస్తోంది. మరి ఈ రోజున మీ తల్లితో ఆ రోజుని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు వీటిని ఫాలో అయిపోండి.

లెటర్స్ రాయడం..

ఏంటి.. వింతగా ఉందే.. ఫోన్స్, మెసేజెస్ అంటూ ప్రతిఒక్కరూ అప్‌డేట్‌గా మారితే ఇంకా ఉత్తరాలేంటి అనుకోవద్దు. ఇవి ఎప్పుడు ప్రత్యేకమే. మీరు మీ అమ్మ కోసం ఓ లెటర్ రాయండి. వీటన్నింటిని ఆమె జాగ్రత్తగా దాచుకుంటుంది కూడా. ఇందులో ఆమె మీకేం చేసింది. మీకు, తనకి మధ్య ఉన్న బంధం గురించి చక్కగా వివరించొచ్చు.

ఫ్లవర్ బొకే..

ఇవి కూడా మంచి గిఫ్ట్. మీ మదర్‌కి పూలు, గార్డెనింగ్ అంటే.. తనకి ఇష్టమైన పూలు, గార్డెనింగ్‌కి సంబంధించిన ఏదైనా గిఫ్ట్ ఎంచుకుని తనకి ఇవ్వండి.

ఆన్‌లైన్ గిఫ్ట్స్..

నేడు ప్రతి ఒక్కడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి, మీ తల్లికి ఏమిష్టమో.. వాటిని చక్కగా ప్లాన్ చేసి కొనివ్వండి. మీరు ఆర్డర్ పెడితే మీ అమ్మకి అవి నేరుగా అందుతాయి. 

వెకేషన్ ప్లాన్ చేయండి..

ప్రతి ఒక్కరికీ వెకేషన్‌కి వెళ్ళాలని ఉంటుంది. అలాంటప్పుడు మీరెందుకు మీ అమ్మగారితో వెళ్ళకూడదు. తనకి ఇష్టమైన ఏదైనా ప్లేస్ ఉండి అక్కడి ఆమె వెళ్ళడం కుదరకపోతే మీరే ఆ ప్లేస్‌కి సర్‌ప్రైజ్‌గా తీసుకెళ్లండి. దీంతో వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. 

స్పా..

రోజూ క్షణం తీరిక లేని పనులతో బిజీగా గడిపే మీ అమ్మని కాస్తా రిలాక్స్ చేయాలంటే ఈ పని చేయండి. స్పా బుక్ చేయండి. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే వారే ఇంటికి వచ్చి స్పా సర్వీసెస్ చేస్తారు. దీని వల్ల ఆమె హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు. రిలాక్స్ కూడా అవుతుంది. మరి ఈ సజెషన్స్ నచ్చాయా.. ఫాలో అయిపోండి. హ్యాపీ మదర్స్ డే.


bottom of page