ఓటీటీ పుణ్యమా అని ఆడియన్స్ కు థియేటర్స్ లో మిస్ అయినా సినిమాలను ఇంట్లో కూర్చొని చూసే అవకాశం దక్కుతుంది.
లాక్ డౌన్ సమయంలో ఓటీటీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఒక ఇప్పుడు ఓటీటీలో వారం వారం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కొన్ని సినిమాలు ఇప్పటి వరకు ఓటీటీ బాట పట్టలేదు. అలాంటి సినిమాల్లో గోపీచంద్ నటించిన రామ్ బాణం సినిమా ఒకటి. శ్రీ వాస్ దర్శత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
ఈ సినిమా పై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. 👏 ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. 😍 ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైన ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు డేట్ ఖరారు చేశారు. 📅🎬ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రామబాణం సినిమా స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 14న రామబాణం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 📽️ థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన రామబాణం ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి. 🍿 అలాగే మరో సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది. 🎥 ఆ సినిమానే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా. 🌟 మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ "భోళాశంకర్". మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. 🎬 తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన "వేదలమ్" సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. 🎞️ ఈ సినిమా పై మెగాస్టార్ ఫ్యాన్స్ లో అంచనాలను తలక్రిందులు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 📉 ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తిసురేష్ మెగాస్టార్ సిస్టర్ రోల్ లో కనిపించింది. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అయ్యింది. 📺 సెప్టెంబర్ 15న భోళాశంకర్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా ఇలా వరుసగా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నాయి. 🎥