top of page
MediaFx

మొదలైన ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌..


ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ను ప్రారంభించింది. బిగ్ బచాత్ డేస్‌ పేరుతో ఈ సేల్‌ను తీసుకొచ్చారు. ఆగస్టు 1వ తేదీ అర్థరాత్రి ప్రారంభమైన ఈ సేల్‌ ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాల వంటివాటిపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అలాగే సేల్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే సేల్‌లో భాగంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందిస్తున్నారు. అంతే కాకుండా సేల్‌లో భాగంగా పలు కొత్త ప్రొడక్ట్స్‌ను సైతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ విషయానికొస్తే యాపిల్‌, సామ్‌సంగ్‌, షావోమీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ష్యాషన్‌కు సంబంధించి దుస్తులపై కూడా తగ్గింపు ధరలు అందిస్తున్నారు. ట్రండీ దుస్తులు, పాదరక్షలతో పాటు బ్రాండెండ్ డ్రస్‌లపై డడిస్కౌంట్‌ లభిస్తోంది. వీటితో పాటు ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ వంటి వంటగది వస్తువులపై కూడా భారీగా డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. ఇయర్ ఫోన్స్‌పే సేల్‌లో భాగంగా ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని ప్రముఖ కంపెనీల ఇయర్‌ బడ్స్‌పై ఏకంగా 50 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలను రూ. 11,000 నుంచి సొతంం చేసుకోవచ్చు. అలాగే వాల్ డెకర్స్‌ రూ. 59 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి.

bottom of page