top of page
Suresh D

కన్నడ బ్లాక్ బస్టర్ 'లవ్ మాక్‌టైల్ 2' నుంచి 'ఎవరితో పయనం' సాంగ్

కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'లవ్ మాక్‌టైల్ 2' నుంచి 'ఎవరితో పయనం' సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, లవ్ మాక్‌టైల్ 2 చిత్రాలతో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు లవ్ మాక్‌టైల్ 2 సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.


bottom of page