top of page
MediaFx

చిక్కుల్లో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..


మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది యువతీ యువకులు పాల్గొన్నారు. అయితే రిసార్ట్‌లలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకుని సేవించడం నేరం అని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మెహ బూబ్ బర్త్ డే పార్టీలో 11 లీటర్ల మద్యంతో పాటు 7 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. అయితే ఈ పార్టీలో కొందరు మాత్రమే మద్యం సేవించారని పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ పదార్థాలు లేవని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మెహబూబ్ ఇచ్చింది రేవ్ పార్టీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశం గురించి మెహబూబ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ బర్త్‌ డే పార్టీలో శ్వేతా నాయుడు, గీతు రాయల్, శ్రీ సత్య, విరూపాక్ష సేం రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.



bottom of page