top of page
Suresh D

“విశ్వంభర” కోసం మరోసారి నాగ్ దర్శకుడు✨🎵


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న మాసివ్ ఫాంటసీ ట్రీట్ చిత్రం “విశ్వంభర”. మరి మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుండగా ఈ చిత్రంలో సాంగ్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది.అయితే ఈ సాంగ్స్ లో ఆల్రెడీ అక్కినేని నాగార్జున హిట్ సినిమా “నా సామిరంగ” దర్శకుడు విజయ్ బిన్నీ ఓ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా తాను ఇంకో సాంగ్ ని కూడా ఈ సినిమా కోసం కంపోజ్ చేసినట్టుగా తెలిపాడు. దీనితో తాను ఆనందంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.మెగాస్టార్ తో రెండు సార్లు వర్క్ చేసే అవకాశాన్ని తాను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా రిలీజ్ కి రాబోతుంది.✨🎵


bottom of page