top of page
MediaFx

రూ. 300తోనే హైదరాబాద్‌ అంతా చుట్టేయొచ్చు..

సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చేశాయ్‌. ఎక్కడికైనా వెళ్దాం అంటూ చిన్నారులు మారాం చేస్తుంటారు. మరి పిల్లలకు హైదరాబాద్‌లో ఉండే పలు ప్రాంతాలను చూపిస్తే భలే హ్యాపీగా ఫీలవుతారు కదూ. అయితే ఒక్క రోజులో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న విషయం కదూ. అందుకే తెలంగాణ టూరిజం వారు మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు.

కేవలం ఒక్కరోజులోనే, అది కూడా చాలా తక్కువ ధరలోనే హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు. ఇందులోని భాగంగా బిర్లామందిర్‌, చౌమహల్లా ప్యాలెస్, ఛార్మినార్‌, మక్కా మజిద్‌, సాలర్‌జంగ్‌ మ్యూజియం, పురాని హవేలి, గోల్కోండ ఫోర్ట్‌, కుతుబ్ షాహి సమాధులు, లుంబిని పార్క్‌ వంటివి కవర్‌ కవర్‌ అవుతాయి.

ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రిజర్వేషన్‌ ఆఫీస్‌, టీఎస్‌టీడీసీ, యాత్రి నివాస్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. అనంతరం 7.45 గంటలకు బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాకు బస్సు చేరుకుంటుంది. ఇక ఉదయం 8.15 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి బస్సు ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ టూర్‌ ప్యాకేజీలో నెహ్రు జూ పార్క్‌ కూడా కవర్‌ అవుతుంది, కానీ శుక్రవారం మాత్రమే ఉంటుంది. ఇక శుక్రవారం రోజు సాలర్‌జంగ్ మ్యూజియంతో పాటు, నిజామ్‌ మ్యూజియం క్లోజ్‌ ఉంటుంది.

టూర్‌ ప్యాకేజీ ధరలు కూడా చాలా తక్కువగా నిర్ణయించారు. నాన్‌ ఏసీ విషయానికొస్తే ట్రావెలింగ్‌కు చిన్నారులకు రూ. 300, పెద్దలకు రూ. 380గా నిర్ణయించారు. అదే ఏసీ విషయానికొస్తే చిన్నారులకు రూ 400, పెద్దలకు రూ. 500గా నిర్ణయించారు. ఎంట్రీ టికెట్స్‌, ఫుడ్‌ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో కవర్‌ అవ్వవు. పూర్తి వివరాల కోసం 9848126947, 8367285285, 9848540371 నెంబర్లకు సంప్రదించండి.


bottom of page