దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏడాది పొడవునా ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ జూలైలో కూడా అరేనా(Arena) డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..మొదటగా మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ కారు ఆల్టో కె10 చాలా వరకు తగ్గింపు ప్రయోజనాన్ని కలిగి ఉంది. జూలై నెలలో రూ.59,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ.4,100 కార్పొరేట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. వ్యాగన్ ఆర్(WagonR) మారుతి సుజుకి యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. రూ.54,000 తగ్గింపు ప్రయోజనాలను కలిగి ఉంది. అందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,100 కార్పొరేట్ తగ్గింపును ప్రకటించింది. ఈ కారు ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ.5.54 - రూ.7.42 లక్షల మధ్య ఉంది.మారుతి సుజుకి యొక్క సెలెరియో కూడా భారీ తగ్గింపులో లభిస్తుంది. ఈ కారుపై రూ.54,000 వరకు తగ్గింపు ఉంది. ప్రయోజనాల్లో రూ.35,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ.4,100 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.37 లక్షల నుంచి రూ.7.14 లక్షల మధ్య ఉంది. S-Presso కారుపై కంపెనీ నుంచి మొత్తం రూ.58,000 తగ్గింపు లభించనుంది. ఇందులో రూ.39,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ.4,100 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఈ మారుతి సుజుకి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల మధ్య ఉంది. అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్(Swift) నగదు మరియు కార్పొరేట్ తగ్గింపుతో సహా రూ.49,000 తగ్గింపు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ కారు రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Eco మారుతి సుజుకి సంస్థ యొక్క ఫ్లాగ్‌షిప్ వ్యాన్‌లలో ఒకటి. రూ.33,000 తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఇది రూ.5.27 లక్షల నుంచి 6.53 లక్షల ధరలో లభిస్తుంది.
మరింత సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించండి.