ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!
- MediaFx
- Aug 8, 2024
- 1 min read
షెకావత్ సార్ ఈ సారి మాత్రం గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీలో ఓ చేతిలో గొడ్డలి.. మరో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపిస్తున్నాడు. షెకావత్‌గా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.