ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఇండియన్ వెబ్ సిరీస్‌లన్నింటిల్లో కెల్లా అత్యధిక ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. అందరూ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నారు. నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఇక రెండో సీజన్ కూడా అంచనాలను మించి ఉంది. రెండో సీజన్‌లో సమంత ప్రత్యేక పాత్రలో మెరిసింది. రాజీ కారెక్టర్‌లో సమంత చేసిన యాక్షన్‌కు అంతా ఫిదా అయ్యారు. రెండో సీజన్ ఎండింగ్‌లో సమంత అయితే చనిపోయినట్టుగా చూపించారు. మరి నెక్ట్స్ రాబోతోన్న మూడో సీజన్‌లో సమంత ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.
ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో దర్శకద్వయం రాజ్ అండ్ డీకేల పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక వారు ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్‌ను కంప్లీట్ చేశారు. ఇక ఫ్యామిలీ మెన్ మూడో సీజన్ మీద వారు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. మూడో సీజన్‌కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేశారట. ఈ మేరకు సందీప్ కిషన్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ అవుతోంది.
సందీప్ కిషన్ రెండో సీజన్‌లో ఓ స్పెషల్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూడో పార్టులో కూడా సందీప్ కిషన్‌కు మంచి రోల్ పడేలా ఉంది. అందుకే ఈ మూడో పార్ట్ మీద సందీప్ కిషన్ అప్డేట్ ఇచ్చాడు. ఈ కొత్త షెడ్యూల్‌లో సందీప్ కిషన్ పాల్గొనేలా ఉన్నాడు. మరి ఈ మూడో సీజన్ షూట్ ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందన్నది చూడాలి.మళ్లీ మనోజ్ భాజ్‌పెయి యాక్టింగ్, ప్రియమణి గ్లామరస్ లుక్స్, యాక్టింగ్ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూడో సీజన్‌ను చూస్తుంటే ఈ సారి చైనా వర్సెస్ భారత్ అనేలా కనిపిస్తోంది.