top of page
Suresh D

'ఫ్యామిలీ స్టార్' కి సెన్సార్ బోర్డు షాక్🎥✨


పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం, కొన్ని డైలాగుల్లో వినిపించిన బూతు పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించింది. సెన్సార్ చెప్పడంతో వాటిని మ్యూట్ చేసేందుకు మూవీ టీమ్ ఒకే చెప్పిందట. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం.ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.🎥✨

bottom of page