మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అమీనా తాజాగా కన్నుమూశారు.
మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అమీనా తాజాగా కన్నుమూశారు. మమ్ముట్టి సోదరి అమీనా(70) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో మమ్ముట్టి కుటుంబం మరోసారి తీవ్ర విషాదంలో మునిగింది.ఈ ఏడాది ఏప్రిల్ లో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మృతి చెందారు. ఆమె వయసు 93 ఏళ్లు. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఆరు నెలల వ్యవధిలో మమ్ముట్టి సోదరి చనిపోవడం చాలా బాధాకరం. ఫ్యాన్స్, సినీ ప్రముఖలు మమ్ముట్టి సోదరికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె అంత్యక్రియలు రేపు అంటే సెప్టెంబర్ 13న జరగనున్నాయి.