దక్షిణ కొరియా (South Korea) పాప్ స్టార్ పార్క్ బో రామ్ (K-Pop Singer Park Bo) ఏప్రిల్ 11న హఠాన్మరణం చెందింది. ఓ పార్టీకి హాజరైన ఆమె అక్కడే కన్నుమూయడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. అమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏప్రిల్ 11న అమె ఓ పార్టీకి హాజరై అక్కడ కొన్ని డ్రింక్స్ తీసుకుంది. ఆ తరువాత వాష్‌రూంకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాలేదు. స్నేహితులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఆమె సింక్‌పై ఒరిగిపోయి అచేతనంగా కనిపించింది. అప్పటికే ఆమె కన్నుమూసింది (K-Pop Singer Park Bo Ram Death shocks fans) . పార్క్ బో రామ్ వ్యవహారాలు చూసే క్సేనాడు ఎంటర్‌టైన్మెంట్ ఎజెన్సీ ఆమె మరణ వార్తను వెల్లడించింది. పార్క్ దూరం కావడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారని తెలిపింది.మధురమైన గాత్రం, సంగీతంతో ఆమె దక్షిణ కొరియానే కాకుండా అనేక దేశాల్లో అభిమానులను సంపాదించుకుంది. పాప్ గీతాలతో పాటూ దక్షిణకొరియాలోని కొన్ని డ్రామా షోలకు ఆమె సంగీతం సమకూర్చింది. 2010లో పార్క్ బో రామ్ 17 ఏళ్ల వయసప్పుడు ఓ సింగింగ్ పోటీ ద్వారా వెలుగులోకి వచ్చింది. 2014లో బ్యూటిఫుల్ ఆల్బమ్ ద్వారా పాప్ ఇండస్ట్రీలోకి కాలుపెట్టింది. ఆ ఏడాది ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకుంది. పార్క్.. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు గడిచిన తరుణంలో ప్రస్తుతం ఆమె మరో అద్భుత ఆల్బమ్‌కు ప్లాన్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఆమె మరణ వార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.