భారతదేశంలో కూడా వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శిచడానికి దేశ ప్రజలు మాత్రమేకాకుండా విదేశీయులు కూడా ఎంతో మంది ఆకర్షితులవుతున్నారు. ఆ స్థలాలు ఏంటో, ఎక్కడున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.. 🌍
వారణాసి వారణాసి ఉత్తర భారతదేశంలోని ప్రపంచ ప్రసిద్ధ నగరం. ఈ నగరం దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. వారణాసి నగరం హిందువులకు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ముఖ్య ప్రదేశం. కానీ ఇక్కడ ఎక్కువగా విదేశీ పర్యాటకులు కనిపిస్తారు. వారణాసి మతం, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉంది. గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ్ ధామ్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి వీధిలో దేవాలయాలు కనిపిస్తాయి. కాబట్టి కాశీని ‘దేవాలయాల నగరం’ అని కూడా పిలుస్తారు. 🕉️
ఆగ్రా ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి భారతదేశంలో ఉంది. అదే ఆగ్రాలోని తాజ్ మహల్. దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. యునెస్కో కూడా దీనిని వారసత్వ సంపదలో ఉంచింది. తాజ్ మహల్ చూసేందుకు భారతీయులే కాదు, విదేశాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. తాజ్ మహల్ అందం, దాని కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. తెల్లటి పాలరాతితో తయారు చేసిన తాజ్ మహల్ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తాజ్ మహల్ కాకుండా తాజ్ మ్యూజియం, ఇతిమాద్-ఉద్-దౌలా, అక్బర్ సమాధి, ఆగ్రాలోని ఎర్రకోట వంటి ప్రసిద్ధ ప్రదేశాలు పర్యాటకులు సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. 🕌
జైపూర్ రాజస్థాన్‌లో చాలా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. జైపూర్ నుంచి ఉదయపూర్ వరకు, జైసల్మేర్ నుంచి అజ్మీర్ వరకు అనేక కోటలు, రాజభవనాలు, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు చూడటానికి వస్తారు. జైపూర్‌లో హవా మహల్, అంబర్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, నహర్‌ఘర్ కోట, జైపూర్ కోటలను చూడవచ్చు. ఇక్కడ భారతీయ సంస్కృతి, చరిత్రకు సంబంధించి అద్భుతమైన అనవాళ్లు ఉన్నాయి. 🏰
గోవా మన దేశంలో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు ఎక్కడ వస్తారు? అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం గోవా అని చెప్పవచ్చు. చాలా మంది పర్యాటకులు గోవాను ఎక్కువగా ఇష్టపడతారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో గోవా ఒకటి. గోవాను దేశానికి ఆహ్లాదకరమైన రాజధాని అని కూడా పిలుస్తారు. చాలా మంది పర్యాటకులు, భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా గోవాకు సరదాగా సెలవులను ఆస్వాదించడానికి వస్తారు. గోవాలో బీచ్‌లు, నైట్ పార్టీలు, క్రూయిజ్ పార్టీలు ఇలా రకరకాల అంశాలు పర్యాటకులకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారుతున్నాయి. 🏖️