top of page
Shiva YT

తండ్రైన హీరో నిఖిల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య పల్లవి.. ఫొటో వైరల్‌ 🌟

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.


తన భార్య పల్లవి బుధవారం (ఫిబ్రవరి 21) పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు అందులో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో నిఖిల్‌- పల్లవిల వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అనుమతితో పెళ్లిపీటలక్కారు. కరోనా సమయంలో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇటీవలు తన సతీమణి గర్భంతో విషయాన్నిఅందరితో పంచుకున్నాడు నిఖిల్‌. అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో భార్య సీమంతం వేడుకలను గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇప్పుడు పల్లవి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్ ఆనందానికి హద్దల్లేకుండా పోయాయి. 🤩👨‍👩‍👦‍👦


bottom of page